తాజా వార్తలు

వల్లభనేని వంశీకి భారీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

తెలంగాణన్యూస్:

Vallabhaneni Vamsi Suffers Major Setback in Supreme Court
  • అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ సతీశ్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఇరువురి వాదనలు విని, మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తాము కేసు మెరిట్స్ తో పాటు, పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదని తెలిపింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్వాసనం ఆదేశించింది.

Show More

Related Articles

Back to top button