తెలంగాణ న్యూస్ జనవరి 13:-
బిజెపి మోతె మండల అధ్యక్షుడిగా రాయకుంట తండాకు చెందిన భుక్యా శంకర్ నాయక్ ను నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మండల బిజెపి నాయకులు సన్మానం చేసి పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని కోరారు..అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ పెద్ద అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు..ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త ధర్మారెడ్డి, బానోతు శ్రీను నాయక్, పెరుగు మధు, గుగులోతు సైదా నాయక్, ఉప్పల రామచంద్రయ్య, నాగం వెంకటేశ్వర్లు, పాలకూరి శ్రీకాంత్, బానోతు శ్రీకాంత్, కాంపాటి నాగయ్య, కాంపాటి వెంకన్న, మైనంపాటి శ్రీనివాస్ రెడ్డి, మైనం పాటి వెంకట్ రెడ్డి, ఉప్పుల రమేష్, హలవత్ మల్సూర్ నాయక్, రంగ, బొంత వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.