తెలంగాణ

మహిమహిళలుముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలి

మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలి* తిరుమలాయపాలెం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు తిరుమలాయపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని మహిళలకు పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.దీనిలో పాల్గొనే మహిళలు శుక్రవారం సాయంత్రం 4గంటల వరకు ఈ నెంబర్లను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు అందజేయబడతాయని అన్నారు. వీటికి సరిపడ ముగ్గు,కలర్స్ తెచ్చుకోవాలని తిరుమలాయపాలెం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ యాదవ్ కోరారు. సంప్రదించవలసిన నెంబర్లు : *99599 42779* *98662 63573* *99125 16821*

Show More

Related Articles

Back to top button