మేలుకో ఓ యువత
అమ్మ పొత్తిల్లలో ప్రాణం పోసుకున్నప్పటి నుండి మొదలు, బయటకు వచ్చి పండు ముసలి అయ్యేవరకు కాలంతో పరుగులు పెడుతూ ప్రయాణిస్తూనే ఉండాలి… అమ్మ కౌగిలి నుండి ఆకాశంలో చందమామను చూస్తూ గోరుముద్దలు తింటూ, నాన్న వేలు పట్టుకొని గమ్యం ప్రారంభించిన వారందరో… ప్రసవించాక తల్లిని కోల్పోయిన వారెందరో…..
తల్లిదండ్రులు లేని అనాధలు ఎందరో….. అవిటి వారై అడుక్కుంటున్న వారెందరో….ఎందరో… ఎందరో… ఈ దేశంలో వాళ్లనేమందురో….. అన్నీ ఉన్నా అస్సహాయులెందరో… నిస్సహాయులెందరో….
బాల్యం బడితో మొదలైన వారెందరో… బరువు బాల్యంతో బ్రతికే వారెందరో…… కళాశాల కాలయాపన ఎందరో…. కాలిన కడుపున కార్మికులేందరో….ఎందరో…. ఎందరో… ఈ దేశంలో మంచి వాళ్ళు ఎందరో… ముంచేవాళ్ళు ఎందరో…
ఆకలికి ఏడ్చే వారెందరో… అరగక ఆయాస పడువారెందరో…ఎందరో… ఎందరో… ఈ దేశంలో దరిద్రాన పుట్టిన దయా గుణం కగిన వారెందరో…. గుణము లేని ధనికులు ఎందరో….. కులం పేరిట కుబేరులు ఎందరో….. కూలీల బ్రతుకుల కులాలెన్నో….. అవకాశాల కోసం ఆయుధాలు ఎన్నో….. ఆయుధాలకు బలి అయినా ఆయుషు లేన్నో,…. సమస్యలను సృష్టించు వారెందరో…… సమస్యలతో సాగిపోవు వారెందరో…. సమస్యలు తీరేది ఎన్నడో….. తీరికగా బ్రతికేది ఎన్నడో…. గడిచిన కాలం ఏమందునో…. గాయాలతో గమ్యం చేరమందున….. నాటి తరానికి నేటి యువతరానికి తరాలు గుర్తుండేలా మేలుకోమందున…….మేలుకో నా యువతరమా….
దేశంలో ఉన్న యువత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేశాన్ని నడిపించవలసిన యువత దీన పరిస్థితికి దిగజారిపోయింది. సమాజ అభివృద్ధి కి యువత తోడ్పాటు చాలా అవసరం. అలాంటి యువత నేడు అనేక భయంకరమైన వ్యసనాలను అలవాటు చేసుకుని వాటితో కాలం గడుపుతున్నారు. యువత ఎంత అప్రమత్తంగా ఉంటే దేశం అంత ముందుకు పోతుంది. అప్పుడు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. చాలా సంవత్సరాలుగా వింటున్న మాట భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని…… అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే యువత జీవితాల్లో అనేక రంగాలలో మార్పులు రావాలి. భయంకరమైన అలవాట్ల నుండి బయటకు రావాలి. గ్రామాల నుండి పట్టణాల వరకు యువత విద్య లేక విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది యువకులు ప్రభావంతులైన వారికి ప్రభుత్వాలు సహకరించవు. ప్రభుత్వాల పేరుతో వ్యాపారవేత్తలు దేశ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యువత జీవితాన్ని అందలం ఎక్కించాలి కానీ ఆగం చేయకూడదు. యువత తలుచుకుంటే దేశ తలరాతను మార్చగల సత్తా ఉన్న నాయకులుగా ఎదగగలుగుతారు.
ప్రపంచ దేశాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాయో అమెరికాలాంటి దేశం ఇంగ్లీష్ 26 అక్షరాలతో ప్రపంచాన్ని శాసిస్తుంది. మన దేశం కుల మతాల కంపులో పడి కూలిపోతుంది. నేడు రాజకీయాలు, వ్యాపారవేత్తలు యువతను పక్కదారి పట్టించి నాణ్యమైన విద్య అందించక , వారంతట వారే ఎందుకు పనికిరాని వారిగా తయారు చేస్తున్నారు .మద్యం మత్తులో గంజాయి లాంటి మారకద్రవ్యాల మత్తులో పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు.సెల్ ఫోన్లు వీడియోలకు అలవాటు పడి రీల్స్ చేస్తూ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకరంగా ప్రశ్నలతో అటు యువతను ఇటు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న ఎంతోమంది ఎలక్ట్రాన్ మీడియా మరియు ప్రింట్ మీడియా లకు ఎదురు దెబ్బ తప్పడం లేదు… భారతదేశంలో యువత చెడిపోయారు అనడానికి ముఖ్యంగా సోషల్ మీడియా మరియు మద్యం, గంజాయి లాంటి మారకద్రవ్యాలే కారణమని చెప్పవచ్చు. ఇలాంటి మత్తు పానీయాలు యువత జీవితాల్లో పెను చీకట్లు కమ్ముకునేలా చేస్తున్నాయి. అందుకే యువత ఆయుషు అర్ధాంతరంగా ముగిసిపోతుంది. కాబట్టి యువత ఇకనైనా మేలుకోవాలి. ఇలాగే కొనసాగితే యువత పరిస్థితి భయంకరంగా మారబోతుంది. ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కానీ తీసుకోదు. యువతకు నాణ్యమైన విద్యను అందిస్తే, ఉపాధి కూడా కల్పించాలి ..కాబట్టి అందుకే ప్రభుత్వాలు యువతను ఎప్పుడు తప్పుడు మార్గంలోనే నడిపిస్తుంది. యువత చేయవలసిన పని ఏది నిజం అని తెలుసుకోవాల్సిన అవసరం యువత మీదే ఉంది. ఇకనైనా మేలుకో యువతరమా మేలుకో……..గతి తప్పిన గతం నుండి గమ్యానికి చేరుకో…పరితపించే నీ ప్రయాణం ప్రపంచానికి తెలియజేయి…
ఆలస్యం చేస్తే అందరం ఎక్కలేవు…ఆశయం కోసం ఆరాటపడు అగ్రస్థానం కోసం పాటుపడు……మండుతున్న నిప్పుల కొలిమిలో నుండి ఎర్రని సూర్యునివై కొత్త రాజకీయాలకు వెలుగునిస్తూ ముందుకు రా !నేడు రాజకీయం రంకుదై రాజ్యమేలుతూ రాసలీల రాయబారం నడుపుతూ, మదమెక్కిన, ఎదకొచ్చిన, రంకె లేసి రాజకీయాలకు ముక్కుతాడు వేయడానికి ముందుకు రా ! గడిచిన తరానికి నేటి యువతరానికి తరాలు గుర్తుండేలా గుండెల్లో గుణపాలై, గురు తప్పని బాణాలై, భయమెరుగని బాటసారివై, అవినీతిని అంతం చేసే ఆయుధమై, ప్రజల పక్షాన పాలకుడివై, అన్నల ఆదరించి, నాన్నలా నడిపిస్తూ నాయకుడివై నయపాలన చేస్తూ శిరస్సు ఆకాశానికి ఎత్తి అంతులేని ఆనందాన్ని నీ ప్రజల గుండెల్లో నింపు……పొద్దే లేని పొదల చాటున కుందేలు పిల్లల కుప్పిగంతులు వేయకు… సింహంలా జూలు విదిలించి గర్జించు…
ఊరికి పట్టిన పీడల .. పవళించిన పానుపుపై పాసుపళ్ళతో … ఊసు కళ్ళతో.. ,కర్మగారంలో ఖైదీల.. చెదిరిన జుట్టుతో, చిరిగిన చొక్కాతో,,, స్నానం చేయని శరీరానికి సాయం చేయడం చేతకాక.. బాధ్యత లేని బ్రతుకు కి భరోసా ఇవ్వలేక , జీవితానికి బ్రతకడానికి మధ్య మూర్ఖుడిలా, ఊరి మధ్యలో ఊర కుక్క వై కూలిన బ్రతుకుతో కృంగిపోకు…… మేలుకో నా యువతరం మేలుకో…….
భాస్కర్ B
జర్నలిస్ట్ (MCJ)