కుల గణన ఘనత కాంగ్రెస్‌దే..
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పరిరక్షణ,ఎస్సి వర్గీకరణ గొప్ప నిర్ణయం
కాకరవాయి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
తెలంగాణ న్యూస్,తిరుమలాయపాలెం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సి వర్గీకరణ నిర్ణయానికి మద్దతుగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ కాకరవాయి గ్రామశాఖ ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయం చాలా అవసరమైందని దీని ద్వారా న్యాయమైన రిజర్వేషన్ ప్రయోజనాలు అందరికి సమానంగా అందుతాయని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తుందని, వరంగల్‌లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తుచేశారు.బీసీ,ఎస్సీ వర్గాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి,వాటికి పరిష్కారం చూపడం కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వారు తెలిపారు.ఈ నిర్ణయాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ధర్మపురి ముత్తయ్య,నల్లగట్టు దుర్గయ్య,పడిశాల దయాకర్,నల్లగట్టు మల్సూర్,నల్లగట్టు నగేష్,నల్లగట్టు రవి, నల్లగట్టు పుల్లయ్య,జిల్లా రాములు,మాజీ సర్పంచ్ యల్లయ్య,సామాజికవేత నల్లగట్టు ఉపేందర్, నల్లగట్టు లింగయ్య,నల్లగట్టు కోటయ్య,నల్లగట్టు గణేష్,నల్లగట్టు వెంకన్న తండ్రి ముత్తయ్య,మెకానిక్ నగేష్,పల్ల వెంకన్న,నల్లగట్టు యల్లయ్య,నల్లగట్టు ప్రభాకర్,నల్లగట్టు జనార్ధన్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.