పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నిక్కా..! అంటున్నారు. సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తిచేసిన వారే చేరతారు.

- లెక్చరర్లకు సమస్యగా మారిన ప్రశ్న పత్రాల రూపకల్పన
- మార్పులు చేయాలంటున్నవిద్యార్థులు, లెక్చరర్లుPolytechnic | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నిక్కా..! అంటున్నారు. సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తిచేసిన వారే చేరతారు. ఇలా పాలిటెక్నిక్ కోర్సులో చేరగానే.. అలా పరీక్ష పెట్టడం, ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థులకు పరీక్షల టెన్షన్ నెలకొంటున్నది. పాలిటెక్నిక్ కోర్సుల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (సీసీఈ) అమలుచేస్తున్నారు. 6 సెమిస్టర్లు ఉండగా, 90 రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నారు.అయితే ఒక సెమిస్టర్‌లో రెండు మిడ్ సెమ్ పరీక్షలు, ఒక ఎండ్ సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇలా 90 రోజుల్లో మూడు పరీక్షలంటే నెలకో పరీక్ష చొప్పున నిర్వహిస్తున్నారు. ఇలా 30 రోజుల వ్యవధిలో ఒక పరీక్ష పూర్తికాగానే మళ్లీ పరీక్షను ఎదుర్కొవాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.Tమిడ్ సెమ్ రద్దుచేయాలన్న డిమాండ్లునెల రోజులకో పరీక్ష ఇటు విద్యార్థులతోపాటు, అటు లెక్చరర్లకు సైతం తలకు మించిన భారమవుతున్నది. ప్రతి నెలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించడం, పరీక్షలు నిర్వహించడం, మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయడం సమస్యగా మారుతున్నది. పాలిటెక్నిక్ పరీక్షలే కాకుండా టైపురైటింగ్, షార్ట్‌హ్యాండ్, సర్టిఫికెట్ కోర్సులకు పేపర్లను సైతం పాలిటెక్నిక్ లెక్చరర్లే తయారుచేయాల్సి వస్తుంది. మొత్తంగా ఒక మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దుచేయాలని విద్యార్థులు, లెక్చరర్లు కోరుతున్నారు. నెలన్నరకో పరీక్ష చొప్పున, రెండు చాప్టర్లకు బదులు మూడు చాప్టర్లకు పరీక్షలు నిర్వహించడం ఉత్తమమన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి