ఘనంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
పాలేరు ఆపద్బాంధవుడిని మరోసారి గెలిపించుకుంటాం :భాషబోయిన వీరన్న ముదిరాజ్
తెలంగాణ న్యూస్,తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మండల పరిధిలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రాబోవు 2028 ఎలక్షన్లలో అందరం ఏకతాటిపై ఉండి పాలేరు ఆపద్బాంధవుడు కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని భాష బోయిన వీరన్న అన్నారు.