బీఎస్పీ జిల్లా నాయకులు నల్లగట్టు శంకర్ మహారాజ్
తెలంగాణన్యూస్,ఖమ్మం :
కాకరవాయి లో జరిగిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల అర్హత లిస్ట్ లో అధిక మొత్తంలో అర్హత లేని వారు ఉన్నారని ఆలా ఉండడం వల్ల నిజమైన ఇండ్లు లేని భూమిలేని నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అర్హత లేని వారి పేర్ల ను తొలగించాలని అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబనికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలని బి ఎస్ పి పార్టీ తరుపున ప్రభుత్వంను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా నాయకులు నల్లగట్టు శంకర్ మహారాజ్,గ్రామ నాయకులు నల్లగట్టు వెంకన్న మహారాజ్, నాగార్జున్ మహారాజ్,శంకర్ మహారాజ్,పుల్లయ్య, ధర్గయ్య, కనకమ్మ,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.