తాజా వార్తలు

కులగణ సర్వేలో మున్నూరు కాపు జనాభా తప్పుడు లెక్క.

ప్రభుత్వం రీ సర్వే నిర్వహించాలి

ఈనెల 17న కలెక్టరేట్ ప్రజావాణి లో వినతులుఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 14ప్రజావాణి:రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 22 శాతం ఉన్న మున్నూరుకాపు కుల జనాభాను మూడున్నర శాతం తక్కువగా చూపించడాన్ని అసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,జిల్లా అధ్యక్షులు పార నాగేశ్వరరావు తప్పుబట్టారు.శుక్రవారం ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈసందర్భంగా వారు మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచిలుగా ఉన్న తమను సర్వేలో 14 లక్షలని తక్కువగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో 28లక్షలని,ప్రస్తుత ప్రభుత్వం 13 లక్షలని చూపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే రీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సర్వేను వ్యతిరేకిస్తూ త్వరలో హైద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల జనాభతో రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే బహిరంగ సభను మున్నూరుకాపు లు విజయవంతం చేయాలని కోరారు.ప్రభుత్వం రీ సర్వే నిర్వహించాలని ఈనెల 17న ఆయా జిల్లా కలెక్టరేట్ లలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు.జనాభా లెక్కలో తక్కువచేసి తమను చూపంచడం వల్ల రిజర్వేషన్ ప్రతీపాదికన అందించే సంక్షేమ ఫలాలు,ఉద్యోగాలు,రాజకీయ పార్టీల సీట్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరుగనుందని ఆవేదన వ్యక్తంచేశారు.
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళైన ఇప్పటికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన రిజర్వేషన్ల ప్రాతిపదిక నేటికి ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఆర్థికంగా వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి సంక్షేమ ఫలాలు దూరమవ్వడం బాధాకరం అన్నారు.రిజర్వేషన్ లో మాసంఖ్యను తగ్గించి, మా మాత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన ప్రభుత్వానికి భవిష్యత్ లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి దేవేందర్, మున్నూరుకాపు ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షులు మేకల బిక్ష్మయ్య,పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ మారిశెట్టి వెంకటేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మానుకోట సత్యనారాయణ మాధురి మధు తదితరులు పాల్గొన్నారు

Show More

Related Articles

Back to top button