
- లాస్ వెగాస్ ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో కార్ల్‌సెన్‌కు పరాభవం
- ఆర్ ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోయిన ప్రపంచ నంబర్ వన్
- ఇటీవల భారత్‌కు చెందిన గుకేశ్ చేతిలోనూ వరుస పరాజయాలు
లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై సంచలన విజయాన్ని సాధించాడు. 19 ఏళ్ల ఈ యువకుడు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్‌సెన్‌ను కేవలం 39 కదలికలలోనే అధిగమించాడు.
ఇటీవల భారత్‌కు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ చేతిలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న కార్ల్‌సెన్ ఇప్పుడు ప్రజ్ఞానంద చేతిలో ఓడిపోవడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఇప్పటికే మూడు టోర్నమెంట్‌లను గెలుచుకున్న ప్రజ్ఞానంద, ఇప్పుడు క్లాసికల్, రాపిడ్, బ్లిట్జ్ అనే మూడు ఫార్మాట్‌లలోనూ కార్ల్‌సెన్‌ను ఓడించాడు.
కాగా, కార్ల్‌సెన్ లాస్ వెగాస్ ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌ను రెండు విజయాలతో ప్రారంభించాడు. కానీ, ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ప్రజ్ఞానంద రమేశ్‌బాబు, వెస్లీ సో చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత అతను బిబిసార అస్సౌబయేవాను ఓడించాడు. కానీ, ఆ తర్వాత రెండు ప్లేఆఫ్ గేమ్‌లలో అరోనియన్ చేతిలో ఓడిపోయాడు.