మణిపూర్_విధ్వంసం . మణిపూర్లో జరిగిన మొత్తం విధ్వంసానికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగే . రాజకీయ ప్రయోజనాల కొరకు కోర్టులో తమకు అనుకూలంగా ఒక తీర్పుని తెప్పించుకొనడం జరిగింది . ఆ తీర్పు వలనే రాష్ట్రంలో అగ్గి రాజుకున్నది . విధ్వంసం జరిగింది .ఎంత దురాగతం అంటే ఈ విచిత్రాతివిచిత్ర తీర్పుపై సుప్రీంకోర్టు కూడా ముక్కు మీద వేలేసుకుంది . తీర్పుని ఇచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పు పట్టింది . ఇంకా ఘోరం ఏంటంటే పిటిషనర్లు మళ్ళా హైకోర్టు ముందుకు వెళ్ళి మేమడిగిన అభ్యర్ధన అది కాదు ప్రభో అని మొరబెట్టుకున్నారు . అయిననూ ఆ న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు ఎలాంటి క్రమశిక్షణా చర్య తీసుకోలేదు . వ్యవస్థలు ఇలా పనిచేయడం వలనే ప్రజలకు వాటి మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది.ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వాలే , చట్టాలను గౌరవించవలసిన ప్రభుత్వాలే , శాంతిభద్రతలను పరిరక్షించవలసిన ప్రభుత్వాలే వాటికి చరమగీతం పాడుతుంటే ప్రజలు ఇంకెక్కడ మొరపెట్టుకోవాలి !?ఏనాటి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ! సిక్కుల ఊచకోతలు , గోద్రా అల్లర్లు , ఇంకా ఎన్నెన్నో ! ప్రభుత్వాల అండతో జరిగే మారణహోమాలు క్షంతవ్యం కాదు . మొన్ననే ఒక భాజపా నాయకుడి వాల్ మీద చూసా . మహాత్మాగాంధీ హత్య తర్వాత గాడ్సే కులానికి/వర్గానికి సంబంధించినవారిని చంపేసారని . ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ?! అహింసాయుత ఉద్యమాల మీద నమ్మకం లేకపోవడం , పంటికి పన్ను కంటికి కన్ను సిధ్ధాంతాన్ని ధర్మహింసా తదైవచా అంటూ సరికొత్త నినాదాలను ఎత్తుకోవడం వలనే .తీగె లాగితే డొంకంతా కదులుతుంది . సూది కోసం సోదికి వెళితే పాత రంకులు బయటపడతాయి . అన్నింటికీ ఒకటే పరిష్కారం . చట్టాల మీద , రాజ్యాంగం మీద నమ్మకం , గౌరవం . Rule of law ని పాటించటం . వ్యవస్థలు తమతమ బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వర్తించటం . స్వధర్మాలను వీడి భారత రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించటం . సర్వే జనాస్సుఖినో భవంతు .
15 1 minute read