స్పెషల్ ఫోకస్

సింగర్ చిన్మయి మరో సంచలన పోస్ట్​

మహిళలకు ఇంటాబయటా ఎక్కడా రక్షణ లేదని వ్యాఖ్య

Singer Chinmayi latest post About Women saftey
  • ఇంట్లోనూ వేధించే వారు ఉండొచ్చన్న గాయని
  • మగవాళ్లు ఇంట్లో ఉంటే మహిళలకు బయట రక్షణమహిళలకు ఈ ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదని ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో, బయట వేధింపులు తప్పడంలేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తాజాగా చిన్మయి తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. బస్సులో ఓ వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. మన దేశంలో రవాణా వ్యవస్థ ఇలానే ఉంటుంది, ఇలాంటి వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారని వ్యాఖ్యానించింది. మీ అమ్మాయి, కూతురు ఇలాంటి ఇబ్బంది పడకూడదంటే ఆమెకు ఓ స్కూటీ కొనివ్వండి.. అదే వారికి సేఫ్ అని చెప్పారు. ఆలయంలో క్యూలో నిలబడినప్పుడు కూడా ఇలాగే జరుగుతోందని చిన్మయి ఆరోపించారు. ‘వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి చున్నీ వేసుకుంది, దుపట్టా ఉంది.. అయినా అలా ప్రవర్తిస్తున్నాడు. మీమ్స్ చేసే వాళ్ళు ఇది చూడండి.. అక్కడ అతని బుద్ధి వంకర గా ఉంది. మగాళ్లందరినీ ఇళ్లల్లోనే ఉంచితే మహిళలకు బయట అంతా సురక్షితంగా ఉంటుంది.. ఒకవేళ ఆడవాళ్లు క్షేమంగా వచ్చినా సరే ఇంట్లోనే ఇలా వేధించే వాళ్ళు ఉండొచ్చు’ అని చిన్మయి తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Show More

Related Articles

Back to top button