బెల్లంపల్లి ఫిబ్రవరి 27 తెలంగాణ న్యూస్:సింగరేణి గని కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో ప్రెస్ మీట్392025 జనవరి మొదటి వారంలో శాంతి గని 2 ను కలుపుకొని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు చేపడతామని పత్రికల సాక్షిగా పాత్రికేయుల సాక్షిగా పత్రిక ముఖంగా ప్రకటించడం జరిగింది. ఇది శాంతిఖని పరిసర గ్రామాల ప్రజలనే కాకుండా బెల్లంపల్లి పట్టణ ప్రజలను కూడా భయాందోళనకు గురిచేసే ప్రకటనవెంటనే స్పందించిన సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకొని మందమరి జిఎం ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆకనపల్లి తెలకపల్లి లింగాపూర్ పాత బెల్లంపల్లి ఎన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అటువంటి నష్టాన్ని పర్యావరణ విద్వాంసాన్ని నాశనమైపోయే జీవవైవిద్యాన్ని వివరిస్తూ సమావేశాలు నిర్వహించిందినిర్వహించింది.ప్రజలు సింగరేణి కార్మిక సంఘాల ఓసి వ్యతిరేక పోరాటాలు నిరసనలకు వెనుకకు మళ్ళిన సింగరేణి యాజమాన్యం మందమరి జిఎం 2025 ఫిబ్రవరి 24,, తేదీన శాంతిగాని ఓపెన్ కాస్ట్ చేస్తున్నారని పనిగట్టుకుని కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అటువంటి ప్రతిపాదన ఏది సింగరేణి యాజమాన్యం వద్ద లేదని, కార్మిక సంఘాల జేఏసీ పై విషం కక్కుతూ, బుకాయిస్తూ రెండు నాలుకల ధోరణితో మరొక పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈ రెండు నాలుకల ధోరణిని వెంటనే విడనాడాలని మందమరి జి.ఎం . దేవేందర్ ని కోరుతున్నాము. అని జేఏసీ నాయకులు తెలిపారు. శాంతికానిని ఇప్పటికే లాంగ్వాన్ మై ప్రాజెక్ట్ పేరుతో పిఎంఆర్ బోర్డర్ మైనర్ షార్ట్ సిఎంఆర్ దిగడానికి గని విస్తరణ లాంటి పేరుతో వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ వారి తప్పుడు ఇంజనీరింగ్ మైనింగ్ విధానాల వలన సీఎంఆర్ పనికి రాకపోగా బోల్టర్ మైనర్ కూడా అరకొరగా పనిచేస్తూ రోజుకు ఒక లారీ బొగ్గు కూడా రాణి పరిస్థితి శాంతి గనిలో కొనసాగుతున్నది ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 6,వ తేదీన లాంగ్వాల్ మైన్ కోసం పర్యావరణ బోర్డు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని ఐదు గ్రామాలకు నోటీసులు పంపించారు. జిఎం రెండు నాలుకల ధోరణి వలన ఈ ప్రజాభిప్రాయ సేకరణ లోపాయికారిగా ఓపెన్ కాస్ట్ కోసమా లాంగ్వాలు ప్రాజెక్టు కోసమా దీనిమీద రాతపూర్వకంగా ప్రజలకు సింగరేణి యాజమాన్యం భరోసాఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న జీఎం తమ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని ప్రజలకు కార్మికులకు శ్రేయస్కరమైన నిర్ణయాలు విధానాలు సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో భారీత ప్రజలతో కలిసి చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు మందమరి జీఎం సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందనిహెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఎండి. ఓజియార్ , హెచ్ ఎం ఎస్ టి , మనిరామ్ సింగ్, , టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కేంద్ర నాయకులు, ఎండి చాంద్ పాషా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి,ఏ మహేందర్, , రాష్ట్ర కన్వీనర్, ఎం పోషమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నీరటి ,రాజన్న, టి ఎస్ యు ఎస్ అధ్యక్షులు, జి. శంకర్, కన్వీనర్, . జి వెంకటస్వామి, పి దుర్గయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
7 1 minute read