తెలంగాణ న్యూస్ కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుమ్మళ్ళ బ్రహ్మయ్య చౌదరికి పూర్వికుల నుండి వంశపారంపర్యంగా కొంత భూమి వచ్చింది. నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకి బ్రహ్మయ్య చౌదరి భూమి మీద ఆశపుట్టి తన పొలంలోనికి వెళ్ళనివ్వకుండా బెదిరిస్తూ కొట్టడం కూడా జరిగింది, ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అంటూ ఈరోజు న్యాయం కోసం పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ నాయకులను గుమ్మళ్ళ బ్రహ్మయ్య చౌదరి కలిశారు.ఈరోజు నుండి గుమ్మళ్ళ బ్రహ్మయ్య చౌదరికి జనసేన పార్టీ అన్ని విధాలుగా న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటాము అంటూ జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యలమందల మాల్యాద్రి, పత్తిపాటి మాధవరావు, గ…
0 Less than a minute