కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్తాయి బడ్జట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెలు ఘనం-కేటాంపులు సంకుచితం అన్న చందంగా ఉందని సిపిఐ పొదిలి మండల సెక్రటరీ కె. వెంకట రత్నం అన్నారు. ప్రధాన్యాతా రంగాలకు కేటాయింపులు తక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. నీటి పారుదల రంగానికి 18,019కోట్లు అంకె పెద్దదిగానే కనపడుతుంది. వెలిగొండ ప్రజెక్ట్ కు 359కోట్లు, ఆర్,ఆర్ ప్యాకేజికి 116 కోట్లు కేటాయింపుచేశారు. రాష్ట్రంలో 4పారిశ్రామిక వాడల అభివృద్ధి చేస్తామని అందులో దొనకొండకు కూడా స్థానం కల్పించడం ఆశ కల్పించినప్పటికీ ఆచరణ అనుమానమేన్నారు,తక్షణ బడ్జట్ను పునః సమీక్ష చేసి వెలిగొండ ప్రాజక్టు నిధులు పెంచేవిధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని లేని పక్షంలో జిల్లా ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తోందని వెంకటరత్నం అన్నారు
0 Less than a minute