తెలంగాణన్యూస్:

- జూన్ 20న విడుదలైన ‘కుబేర’
- రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో
- మే 30న పలకరించిన ‘భైరవం’
- ‘జీ 5’లో రేపటి నుంచి అందుబాటులోకి
శేఖర్ కమ్ముల ఈ కథలో ఒక కొత్త పాయింట్ ను టచ్ చేశాడనీ, నాగార్జునతో ఒక డిఫరెంట్ రోల్ చేయించాడనే టాక్ వచ్చింది. అలాగే ఈ మధ్య కాలంలో దేవిశ్రీ నుంచి మంచి అవుట్ పుట్ వచ్చిన సినిమాగా దీనిని గురించి చెప్పుకున్నారు. హీరోయిన్ గా కాకుండా రష్మిక పాత్రను ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో చూపించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. అలాంటి ఈ సినిమా రేపటి నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఇదే రోజున ‘జీ 5’లో ‘భైరవం’ స్ట్రీమింగ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. మంచు మనోజ్ .. నారా రోహిత్ ప్రధానమైన పాత్రలను పోషించగా, వారి సరసన అదితి శంకర్ .. ఆనంది .. దివ్యపిళ్లై నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. మే 30వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, రేపటి నుంచి ‘జీ 5’ ద్వారా పలకరించనుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాలు మంచి మార్కులు కొట్టేస్తాయేమో చూడాలి.