తాజా వార్తలు

డీఐజీ స్థాయి అధికారుల‌ను జ‌గ‌న్ మాఫియా డాన్‌ల‌తో పోల్చ‌డం దారుణం: పోలీసు అధికారుల సంఘం

YS Jagan Comparing DIGs to Mafia Dons Deplorable Says Police Association
  • జ‌గ‌న్‌పై రాష్ట్ర‌ పోలీసు అధికారుల సంఘం అధ్య‌క్షుడు శ్రీనివాస‌రావు ఫైర్‌
  • విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు
  • వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఇదే పోలీసులు ప‌నిచేశార‌న్న శ్రీనివాస‌రావు
  • ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌పై జ‌గ‌న్‌ చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని వెల్ల‌డి
డీఐజీ స్థాయి అధికారుల‌ను వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మాఫియా డాన్‌ల‌తో పోల్చ‌డం దారుణమ‌ని రాష్ట్ర‌ పోలీసు అధికారుల సంఘం అధ్య‌క్షుడు శ్రీనివాస‌రావు అన్నారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఇదే పోలీసులు ప‌నిచేసిన విష‌యాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయారా అని శ్రీనివాస‌రావు నిల‌దీశారు. ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని తెలిపారు. పోలీసుల్ని బెదిరించ‌డం స‌రికాద‌న్నారు.

తాము చ‌ట్ట‌బ‌ద్ధంగా, న్యాయ‌బ‌ద్ధంగా విధులు నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. అభ్యంత‌రాలు ఉంటే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించాల‌ని సూచించారు. అంతేగానీ ఇష్టారీతిన పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు.

Show More

Related Articles

Back to top button