తాజా వార్తలు

 హైకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట

Revanth Reddy Gets Relief in High Court Atrocity Case
  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు
  • సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని కేసు
  • కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారంటూ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యపై 2016లో అట్రాసిటీ కేసు నమోదైంది.

ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత నెల 20న వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని తేలినట్లు తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.

Show More

Related Articles

Back to top button