తాజా వార్తలు

‘వార్ 2’ కొత్త పోస్ట‌ర్ షేర్ చేసిన తార‌క్

War 2 Countdown Poster Shared by Jr NTR
  • హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా స్పై థ్రిల్లర్ ‘వార్ 2’
  • ఆగష్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • విడుద‌ల‌కు ఇంకా 30 రోజులే ఉందంటూ కౌంట్‌డౌన్ పోస్ట‌ర్ రిలీజ్‌
  • ఈ పోస్ట‌ర్‌ను ఎక్స్ వేదిక‌గా పంచుకున్న తార‌క్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ ‘వార్ 2’. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కి ఇది సీక్వెల్‌గా వస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనున్నారు. తార‌క్‌ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఆగష్టు 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు.

ఈ క్ర‌మంలో ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 30 రోజులే ఉంద‌ని తెలుపుతూ.. చిత్రం బృందం కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. తాజాగా ఈ పోస్ట‌ర్‌ను ‘ఎక్స్’ వేదిక‌గా తార‌క్ షేర్ చేశారు. ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

Show More

Related Articles

Back to top button