తాజా వార్తలు

హీరో రవితేజ ఇంట విషాదం

Ravi Tejas father Rajgopal Raju Passes Away
  • హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతి
  • విషయం తెలిసి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ ప్రముఖులు
  • రాజగోపాల్ రాజు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ప్రముఖులు
టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచారు. దీంతో రవితేజ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రవితేజ సన్నిహితులు, ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని రాజగోపాల్ రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా, వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించారు.

Show More

Related Articles

Back to top button