సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. |సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను డబ్బింగ్ స్టూడియోలో చూశారు. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. ‘నాకు దళపతిలా అనిపించింది’ అని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అంటూ అనుభవాన్ని పంచుకున్నారు లోకేష్.ఈ వ్యాఖ్యలతో రజనీకాంత్ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. 1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా, రజనీ కెరీర్‌లో ఎమోషన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లకు మారుపేరు. అలాంటి సినిమాను గుర్తు చేయడం అంటే, కూలీపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ, ముందు రజనీ సార్ కోసం ఒక ఫాంటసీ సినిమా కథను రాశా. ఆయన వెంటనే ఓకే చెప్పారు. కానీ సెట్స్‌పైకి వెళ్లాలంటే ఏడాదిన్నర పడుతుంది. అందుకే కూలీ కథతో ముందుకెళ్లాను. రజనీ సార్ లాంటి వారికైతే మనం ఏ కథనైనా రాయొచ్చు. ఆయనకు ఉన్న లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌ను ‘కూలీ’లో ప్రెజెంట్ చేసేందుకు కొత్త టెక్నిక్స్, స్టైల్ ట్రై చేశాను. అయినా ఇది పూర్తిగా రజనీకాంత్ సినిమానే అని వివరించారు.ఈ భారీ ప్రాజెక్ట్‌లో పలు ఇండస్ట్రీలకి సంబంధించిన స్టార్స్ నటించారు. నాగార్జున (టాలీవుడ్), ఆమిర్ ఖాన్ (బాలీవుడ్), ఉపేంద్ర (కన్నడ), , సౌబిన్ షాహిర్ (మలయాళం), ఇంకా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో రూపొందుతోంది. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత లోకేష్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’పై ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.