పాలేరు నియోజకవర్గానికి చెందిన ప్రత్యేక అధికారి రమేష్,మంత్రి క్యాంప్ కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రాన్ని సందర్శించారు. వారు మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్య వసతులు, డాక్టర్ల హాజరు, చికిత్సా సేవలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని, పనుల పురోగతిపై నివేదికలు సిద్ధంగా ఉంచాలని, లబ్ధిదారులకు ఐకెపి ద్వారా రుణం ఇప్పించేందుకు ఐకెపి సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని, అలాగే ఉచిత ఇసుక సరఫరాపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.కె. సిలార్ సాహెబ్, ఎంపీఓ పి. సూర్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ మిథున్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.