మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. షాపులో నుంచి రూ.6వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

, తెలంగాణ న్యూస్:ఫిబ్రవరి 22: మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో ఉన్న పలు కిరాణాషాపుల్లో మైనర్లకు సిగరెట్లను అమ్ముతున్నారంటూ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఎస్‌బీఐ ముందు కిరాణాషాపు నిర్వాహకురాలు గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. షాపులో నుంచి రూ.6వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.అదే ప్రాంతంలో కిరాణాషాపు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి కూడా మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు. రూ.3వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు