మిర్చి బస్తాలు దొంగిలించిన దుండగులు
జూపెడ గ్రామంలో సంఘటన
తెలంగాణన్యూస్,తిరుమలాయపాలెం:
“గుండె మంటకు మరింత నిప్పు పోసినట్టు..!” అసలే మిర్చి రేటు లేక పండించిన రైతులు ఆర్థిక నష్టాన్ని చవి చూస్తుంటే ఇందులోనే దుండుగలు రెచ్చిపోతున్నారు. మినీ వ్యాన్ లో లోడ్ చేసి ఉంచిన మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లిన సంఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని జూపెడ గ్రామం(సాకాలి దుబ్బా)కాలనీలో ముగ్గురి రైతుల మిర్చి బస్తాలను మంగళవారం రాత్రి 9:30 సమయంలో అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ లో లోడ్ చేసి ఉదయాన్నే మార్కెట్ వెళ్లేందుకు పార్కు చేసి ఉంచారు.ఉదయం మూడు గంటల సమయంలో వచ్చేసరికి తాడు విప్పిన విషయాన్ని డ్రైవర్,రైతులు గుర్తించారు.మొత్తం 10బస్తాలు దొంగిలించబడ్డాయని బాధితులు తెలిపారు.