కల్లు వ్యాపారంలో ఆసూయ… విషప్రయోగంతో షాక్!
తెలంగాణ న్యూస్,ఖమ్మం :
కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలో కల్లు వ్యాపారం సంబంధించి దారుణ ఘటన చోటుచేసుకుంది.ఒక గౌడకు వ్యాపారం బాగా నడుస్తోందనే అసూయతో మరో గౌడు విషప్రయోగానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఏమి జరిగింది..?
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జీళ్ళచెరువు గ్రామానికి చెందిన గౌడ కులస్తులు గ్రామ సమీపంలోని తాళ్లల్లో చాలా ఏండ్లుగా తాటికల్లు తీసి విక్రయిస్తున్నారు.జీళ్ళచెరువు కు చెందిన వీరబాబు గౌడ్ అనే వ్యక్తి కి జోరుగా కల్లు వ్యాపారం సాగుతుంది.. అదే గ్రామానికి చెందిన ఐతేగాని రమేష్ గౌడ్ కి ఇది అసహనాన్ని కలిగించింది.దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.అసూయ,కోపం మనసులో పెట్టుకున్న రమేష్ గౌడ్ ఫిబ్రవరి 6న రాత్రి సమయంలో వీరస్వామి గీసే తాటి చెట్టుకు కట్టిన 3కల్లు లోట్లల్లో పురుగుమందును కలిపాడు.పొద్దున్న తాటిచెట్టు పై లోట్టిని విప్పే క్రమంలో వింత వాసన రావటంతో పురుగుమందు కలిపిన విషయాన్ని వీరస్వామి గుర్తించాడు.దీంతో పెద్ద ప్రాణాపాయ పరిస్థితి తప్పింది.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విష ప్రయోగం చేసిన రమేష్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కూసుమంచి ఎస్ఐ నాగరాజు తెలిపారు.