*వాటర్ ప్లాట్ . హొటల్ యజమాని సంగ కాళేశ్వర్ పై దాడి*
*ఒక్కసారి దాడితో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు*
*హోటల్ ధ్వంసం చేసి కాలేశ్వర్ మీద దాడి చేసిన వారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి :స్థానిక ప్రజలు*
తెలంగాణ న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03 ; వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో 40 వ డివిజన్ ఉర్సు ఉమ్మర్ గల్లీ ఎదురుగా వాటర్ ప్లాంట్ అలాగే హోటల్ నిర్వహిస్తున్న యజమాని సంగ కాళేశ్వర్ పై ఆదివారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో సంగ కాలేశ్వరం మీద ముగ్గురు వ్యక్తులు వచ్చి నానా బూతులు తిడుతూ అతని మీద దాడి చేసి అతని వస్తువులను ధ్వంసం చేశారు.సంగ కాళేశ్వర్ దెబ్బలకు తట్టుకోలేక 100 కు డయల్ చేసారు.సోమవారం సాయంత్రం హోటల్ మీద దాడిచేసిన యువకులు అనుచరులు వచ్చి 100 డయల్ చేసినందుకు విత్ డ్రా చేసుకోవాలి లేకుంటే నీ అంతు చూస్తాం అని బెదిరింపులకు గురిచేశరని బాధితుడుుు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు ఎంక్వయిరీ నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆరోపించారు.ప్రజలు సైతం భయాందోళనకు గురికావాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.