తాజా వార్తలు

సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు కుదరదు

* సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం..
* ఏవిధంగా ఇవ్వవచ్చో నిపుణుల ద్వారా చర్చ
* ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రక్రియ వేగవంతం
* జర్నలిస్టులతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిఖమ్మం: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎటువంటి సొసైటీల ద్వారానైనా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏ విధంగా ఇవ్వవచ్చు అనే అంశాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర నిపుణుల ద్వారా చర్చించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ను జర్నలిస్టుల బృందం సోమవారం కలిసింది. ఈ క్రమంలో నిపుణులతో ప్రాథమికంగా చర్చించారు. కోడ్ ముగిశాక వేగంగా ఇళ్ల స్థలాల ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశారు. ఇండ్ల స్థలాల అంశంలో ఖమ్మం అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో బ్యూరో ఇన్ చార్జీలు సయ్యద్ ఖదీర్ , దువ్వా సాగర్ , కొత్తపల్లి శ్రీనివాస రెడ్డి , కూరాకుల గోపి , ఆవుల శ్రీనివాస్ , కొత్త యాకేష్, రిపోర్టర్లు గరిడేపల్లి వెంకటేశ్వర్లు , షేక్. సుభాన్ తదితరులు ఉన్నారు.

Show More

Related Articles

Back to top button