తెలంగాణ న్యూస్ధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించం – ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా
ఒంగోలు : విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోనని జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం జాయింట్ కలెక్టరు ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వివిధ కేటగిరీలలో సచివాలయాల ద్వారా అందించాల్సిన సేవలు పేలవంగా ఉండడం, ఎంపీడీవో ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కి షోకాజు నోటీసులు జారి చేయాలనీ జడ్పీ సీఈఓ కు చెప్పారు. స్కూల్ టాయిలెట్ల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు, ఏపీ సేవా సర్వీసుల పేమెంట్ డబ్బులు సకాలంలో జమ చేయడం, హౌస్ జియో కో-ఆర్డినేట్స్, ఎన్.పి.సి.ఐ. నమోదు విషయంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సాహించబోనని ఆమె స్పష్టం చేసారు. పలుమార్లు చెప్పినా ఈ విషయాలలో పురోగతి కోసం ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని ఎంపీడీఓ లపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 6 ఏళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డుల నమోదు కోసం ఏర్పాటు చేస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అగన్వాడీ కేంద్రాలలో తాగు, టాయిలెట్లకు నీటి వసతి సత్వరమే కల్పించాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ లలో పారిశుధ్యంతో పాటు మంచి నీటి కుళాయి కనెక్షన్లు, ఇంటి పన్నులపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఉపాధి హామీ పధకంలో లక్ష్యం మేరకు పని దినాలు కల్పించి లేబర్ బడ్జెట్ ను వినియోగించుకునేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టరు దిశా నిర్దేశము చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదిన సామూహిక గృహ ప్రవేశాలు ఉన్నందున పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో హౌసింగ్ పీడీ పి. శ్రీనివాస ప్రసాద్, డీపీవో వెంకట నాయుడు, డ్వామా మా పీడీ జోసఫ్ కుమార్, జడ్పీ సీఈఓ చిరంజీవి, సీపీవో వెంకటేశ్వర్లు, పరిశ్రమల జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు….