తెలంగాణ న్యూస్ కనిగిరి)బాలల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం,బాల్య వివాహాలను నివారించి సాధికారత దిశగా బాలికలను ఎదగనిద్దాం అంటూ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కొనియాడారు, అందుకే రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాల్యం కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది అన్నారు, బాలికల ఆరోగ్యం, విద్య, సమగ్ర ఎదుగుదలపై దృష్టి దృష్టి పెట్టాలని తెలిపారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా ప్రసంగిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు , ఎంఈఓ లు, సి డి పి ఓ.లు, అంగన్వాడి సూపర్వైజర్లకు కనిగిరిలో డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ, బాలల హక్కులపై సదస్సులో పాల్గొన్న కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే శ్రీ.ఉగ్ర నరసింహ రెడ్డి, బాలికల విద్య,అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే నరసింహారెడ్డి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు
0 Less than a minute