తెలంగాణ

సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం అదిరింది!

సంక్రాంతి సందర్భంగా భారీ లాభాల్లో ఏపీఎస్ ఆర్టీసీ

apsrtc in huge profits for sankranti festival
  • సంక్రాంతి పండుగకు 7,200 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన ఏపీఎస్ ఆర్టీసీ
  • ఇప్పటి వరకూ ఏపీఎస్ ఆర్టీసీకి రూ.12 కోట్ల ఆదాయం

సంక్రాంతి పండుగ ప్రత్యేక సర్వీసుల ద్వారా ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు చేరుకునే ప్రయాణికుల కోసం జనవరి 8 నుంచి 13వ తేదీ వరకూ దాదాపు 3400 సర్వీసులను ఆర్టీసీ నడిపింది. అలాగే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణానికి 16వ తేదీ నుంచి 20 వరకు 3800 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
మరోపక్క సంక్రాంతి పండుగకు నడిపే బస్సుల్లో ప్రయాణికులపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించడంతో పాటు రానుపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకున్న వారికి పది శాతం రాయితీ కూడా కల్పించింది. ఈ క్రమంలో సంక్రాంతికి ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణాలు సాగించారు. తద్వారా ఆర్టీసీకి ఇప్పటి వరకూ సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ పండుగకు రూ.12.5 కోట్ల ఆదాయ లక్ష్యంగా ఆర్టీసీ అంచనా వేసుకోగా ఆ లక్ష్యానికి చేరుకుంటోంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల తిరుగు ప్రయాణాలు కొనసాగుతున్నందున మరింత ఆదాయం వస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. గత ఏడాది రానుపోను కలిపి ఆర్టీసీకి రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేశారు.

Show More

Related Articles

Back to top button