తాజా వార్తలు

 80 ఫీట్ల రోడ్ల వెడల్పు సరికాదు : నాయుడుపేట వాసులు

తెలంగాణన్యూస్:

ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పున‌కు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

Khammam Rural : 80 ఫీట్ల రోడ్ల వెడల్పు సరికాదు : నాయుడుపేట వాసులు

ఖమ్మం రూరల్, జూలై 15 : ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పున‌కు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట కాలనీలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు మార్కింగ్ ను 80 ఫీట్ల వెడల్పున‌కు పెట్టి ఫైనల్ చేస్తున్న క్రమంలో సిబ్బందిని అడ్డుకున్నారు. 60 ఫీట్ల వెడల్పున‌కు మాత్రమే రోడ్డును విస్తరించాలని, 80 ఫీట్ల వెడల్పు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దీంతో మార్కింగ్ ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసి వెళ్లిపోయారు.

ADVERTISEMENT

ప్ర‌త్యామ్నాయం చూపి రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాలి

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనాధారం గడుపుతున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో తమ ఇండ్లు పూర్తిగా కూల్చివేస్తే భార్యా పిల్లలతో రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రోడ్డు విస్తరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. గతంలో 60 ఫీట్ల వెడల్పు అని చెప్పి, 80 ఫీట్లకు మార్కింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్ర‌శ్నించారు. తమ ఇబ్బందులను, ఇండ్లు కోల్పోవడం ద్వారా ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి అనేకమార్లు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయంపై ఎలాంటి ప్రకటన రాలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా 80 ఫీట్ల విస్తరణకు ఒప్పుకునే ప్రసక్తి లేదని నాయుడుపేట కాలనీవాసులు తేల్చిచెప్పారు.

Show More

Related Articles

Back to top button