భక్తి

ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరిసంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూవుంటుందో, ఏ మహాత్ముని పావనవదనం ప్రేక్షకుల నయనచకోరాలకు, అమృతం చిందే వెన్నెల పాత్రమో, ఏ మహనీయుని భుజదండాలు సర్వదిక్పాలకులకూ పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహాపురుషుడు భువనమోహనుడో అట్టి పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, సౌధశిఖరాలపై విరాజిల్లే రాజీవనలోచనలు కుసుమరాజి కురిపించగా రాజమార్గంలో సాగివెళ్ళాడు.ఉ.జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతోఁ జామరం
బులతోఁ బుష్ప పిశంగచేలములతో భూషామణి స్ఫీతుఁడైనలినీబాంధవుతో శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతోబలభిచ్చాపముతోఁదటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.శ్వేతచ్ఛత్రంతో, చామరాలతో, పుష్పములతో, పీతాంబరాలతో, మణిగణాలంకారంతో, ప్రకాశించే పద్మపత్రనేత్రుడైన శ్యామసుందరుడు, సూర్యబింబంతోనూ, చంద్రధ్వజంతోనూ, నక్షత్రసమూహంతోనూ, ఇంద్రచాపంతోనూ, మెరుపుతీవతోనూ భాసిల్లే నీలమేఘంలా ఉన్నాడు.శ్రీకృష్ణుడు జననీజనకుల సౌధానికి వెళ్ళాడు. దేవకీ మొదలైన ఏడుగురు తల్లులకూ నమస్కరించాడు.
క.బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు, జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బాలోడ్డగిలఁ బ్రేమభరమున, జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా!చిన్నకన్నయ్య మ్రొక్కగా కన్నతల్లులు తటాలున ఆయన్ను తమ ప్రేమాంకాలలో కూర్చుండబెట్టుకున్నారు. పుత్రప్రేమవల్ల వారి వక్షోజాలలో పాలు పొంగిపొరలాయి. తల్లులందరూ నల్లనయ్యను తమ ఆనందభాష్పాలతో అభిషేకించారు.శ్రీకృష్ణుడు అంతఃపురకాంతలం జూడఁ బోవుట:-తరువాత గోవిందుడు పదహారువేల నూటయెనిమిది స్వర్ణసౌధాలతో కూడిన అంతఃపురప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకున్నాడు-మ.
ఒక భామా భవనంబు మున్ను సొర వేఱొక్కర్తు లోఁగుందునోసుకరాలాపము లాడదో, సొలయునో, సుప్రీతి నీక్షింపదో,వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్ప్రకటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూపవ్యక్తుఁడై భార్గవా!ముందుగా ఒక సుందరి మందిరానికి వెళ్తే వేరొక సుందరి కుందుతుందేమో! తొందరపాటుతో సూటిగా మాట్లాడదేమో! సొక్కిపోతుందేమో! ప్రేమతో వీక్షించదేమో! వైకల్యం వహిస్తుందేమో! అని’ అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి, అత్యద్భుతమైన మహిమతో ఒక్కమాటుగానే ప్రవేశించాడు.ఆవిధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన యదునందనుణ్ణి చూచి-క.శిశువులఁ జంక నిడి తను, కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్రశనలు జాఱఁగ సిగ్గున, శశిముఖు లెదురేఁగి రపుడు జలజాక్షునకున్.చంటిబిడ్డలను చంకనబెట్టుకొని, విరహతాపంవల్ల చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గునలేచి సిగ్గుతో కాంచీకలాపాలు జారిపోగా చంద్రముఖులందరూ యదుచంద్రునకు ఎదురువచ్చారు.మ.పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గ్రహాగతుఁడయ్యెన్ మును సెరెఁబో తొలుత మత్కాంతుండు నాశాలకేనితరాలభ్య సుఖంబు గంటి నని తా రింటింట నర్చించి ర
య్యతివల్ నూఱుఁ బదాఱు వేలు నెనమండ్రవ్వేళ నాత్మేశ్వరున్.”ఇదుగో నా భర్త నా యింటికే తొలుత వచ్చాడు. నా ప్రాణేశ్వరుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా మనోనాథుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ పదహారువేల నూటయెనిమిది మంది రమణీమణులూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి అర్చించారు.🙏🙏🌹🕉️-సశేషంయదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే!!వరామగోవింద నారాయణ మహాదేవ, కృష్ణం వందే జగద్గురుమ్!!సర్వం శ్రీకృష్ణ భగవత్పాదారవిందార్పణమస్తు!సర్వేజనా సుఖినోభవంతు!శివాయ గురవే నమః!!సమర్పణ:-జంధ్యాల మోహనసత్యసాయి

Show More

Related Articles

Back to top button