తెలంగాణహోమ్

కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్ డి కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవ గౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.

Show More

Related Articles

Back to top button