అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. బరువు తగ్గేందుకు గాను చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు గాను డైట్‌లో మార్పులు చేసుకుంటారు.

Weight Loss Drinks | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. బరువు తగ్గేందుకు గాను చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు గాను డైట్‌లో మార్పులు చేసుకుంటారు. అలాగే రోజూ వ్యాయామం చేయడం, వేళకు భోజనం చేయడం వంటివి కూడా పాటిస్తుంటారు. అయితే ఇవే కాకుండా రోజూ ఉదయం పలు రకాల డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. పలు రకాల పానీయాలు బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే ఉదయం పరగడుపునే ఆయా పానీయాలను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
రోజూ ఉదయం పరగడుపునే నిమ్మరసం, తేనె నీళ్లను తాగితే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా రోజూ చేస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ డ్రింక్‌ను తాగడడం వల్ల మెటబాలిజం పెరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. తేనె శరీరానికి శక్తిని అందిస్తుంది. నిమ్మరసం వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది.
జీలకర్ర నీళ్లు..
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను వడకట్టి తాగేయాలి. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కేవలం బరువును తగ్గించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు కూడా జీలకర్ర ఎంతగానో సహాయ పడుతుంది. ఈ నీళ్లను సేవిస్తుంటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిపోతాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలో ఉసిరికాయలు కూడా ఎంతగానో పనిచేస్తాయి. ఉసిరికాయల్లో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొవ్వు కరిగేందుకు సహాయం చేస్తాయి. రోజూ ఉదయం 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాదు, కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
తేనె, దాల్చిన చెక్క పొడి..
ఉదయాన్నే పరగడుపునే తేనె, దాల్చిన చెక్క పొడి నీళ్లను తాగినా కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి సేవించాలి. రోజూ ఇలా తాగుతుంటే మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. ఈ నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. శరీరానికి శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. అదేవిధంగా అల్లం రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటున్నా కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త అల్లం రసం, కాస్త నిమ్మరసం కలిపి రోజూ పరగడుపునే తాగుతుండాలి. దీని వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అల్లం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అల్లం రసం సేవిస్తే అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధిక బరువును తగ్గించడంలో సహాయ పడతాయి. ఇలా పలు రకాల డ్రింక్స్‌ను ఉదయం పరగడుపునే తాగుతుంటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.