తెలంగాణ న్యూస్:Inter Exam Fee | మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.

Inter Exam Fee | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రయివేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవద్దనే ఉద్దేశంతో వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్ వార్షిక పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి, సెకండియర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.