హైదరాబాద్

13 నిమిషాల్లో 13 కిలోమీట‌ర్ల జ‌ర్నీ.. హైద‌రాబాద్ మెట్రోలో దాత గుండె త‌ర‌లింపు..!

దాత గుండె త‌ర‌లింపు కోసం హైద‌రాబాద్ మెట్రో గ్రీన్‌కారిడార్‌ ఏర్పాటు

 Hyderabad Metro Facilitates Green Corridor for Heart Transplantation

  • ఎల్‌బీన‌గ‌ర్‌ నుంచి దాత గుండెను ల‌క్డీక‌పూల్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లింపు
  • అతివేగంగా దాత గుండెను ట్రాన్స్‌పోర్ట్ చేయ‌డంలో హైద‌రాబాద్ మెట్రో రైల్ కీరోల్‌

గుండె ట్రాన్స్‌ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీ కోసం చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో హైద‌రాబాద్ మెట్రో కీరోల్‌ పోషించింది. హైద‌రాబాద్ మెట్రో సంస్థ గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఈ గ్రీన్ ఛానెల్‌ ద్వారా సుమారు 13 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 13 నిమిషాల్లోనే చేరుకోవ‌డం జ‌రిగింది. ఎల్‌బీన‌గ‌ర్‌లోని కామినేని ఆసుప‌త్రి నుంచి దాత గుండెను ల‌క్డీక‌పూల్‌లోని గ్లెనిగేల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రికి అత్యంత వేగంగా త‌ర‌లించారు. ఈ రూట్‌లో ఉన్న‌ 13 స్టేష‌న్లు దాటి ఇలా అతివేగంగా దాత గుండెను ట్రాన్స్‌పోర్ట్ చేయ‌డంలో హైద‌రాబాద్ మెట్రో రైల్ కీల‌క పాత్ర పోషించింది.
నిన్న (శుక్ర‌వారం) రాత్రి 9.30 నిమిషాల స‌మ‌యంలో మెట్రో రైలు ద్వారా దాత‌ గుండెను త‌ర‌లించారు. స‌రైన ప్రణాళిక‌తో పాటు సమర్థత, సమన్వయం కార‌ణంగా గుండె ట్రాన్స్‌ప్లాంటేష‌న్ స‌ర్జ‌రీ స‌ఫ‌ల‌మైన‌ట్లు స‌మాచారం. ఇక భాగ్య‌న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అందుకే గుండె త‌ర‌లింపులో ఆల‌స్యం కాకూడదనే ఉద్దేశంతో మెట్రో రైలులో దాన్ని పంపించారు.

Show More

Related Articles

Back to top button