తిరుమలాయపాలెం మండలంలోని గోల్ తండా శివారు, జింకలగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తన కుమారుడు సయ్యద్ ఇమామ్ “సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్” ను ఏర్పాటు చేశారు.ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు, అనాథ పిల్లలకు విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలు అందిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం జల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు.ట్రస్ట్ కో-చైర్మన్ సయ్యద్ సిలార్, ట్రెజరర్ సయ్యద్ సైదా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల ఎస్సై కూచిపూడి జగదీశ్, ఎంఈఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం 60 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, జామిటర్ బాక్స్, పెన్నులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై కూచిపూడి జగదీశ్ మాట్లాడుతూ – “పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకం. ట్రస్ట్ విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రిని అందించడం చాలా మంచి విషయం. దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని కోరుతున్నాను” అని సూచించారు.
అదేవిధంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ – “ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించేందుకు ట్రస్ట్ సేవలు అభినందనీయం” అని తెలిపారు.
పరీక్ష కిట్ పొందిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. “ఇది మా కుటుంబానికి ఆర్థిక భారం లేకుండా మాకు అవసరమైన వస్తువులను అందించినట్లయింది. మంచి మార్కులు సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది” అని కొందరు విద్యార్థులు తెలిపారు.
పరీక్ష కిట్ పొందిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. “ఇది మా కుటుంబానికి ఆర్థిక భారం లేకుండా మాకు అవసరమైన వస్తువులను అందించినట్లయింది. మంచి మార్కులు సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది” అని కొందరు విద్యార్థులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజేష్, షేక్ చందు, సయ్యద్ సైదా, సయ్యద్ అమీర్ సాబ్, సయ్యద్ అమీర్, ఉబేద్ తదితరులు పాల్గొన్నారు.