
విజయవాడ: స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.విద్యుత్ బిల్లుల భారాలను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల కాపీలను సీపీఎం నేతలు దగ్ధం చేశారు. కృష్ణలంకలో చేపట్టిన ఆందోళనలో సీపీఎం శ్రీనివాసరావు, బాబూరావు, కాశీనాధ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశామని చెప్పారు.ప్రజలే స్వచ్చందంగా ఈ నిరసనలో పాల్గొన్నారని అన్నారు. విద్యుత్ భారాలు ప్రజలపై లేకుండా చూడాలని కోరారు. డిస్కంలు అప్పులపాలు అయితే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. P4 అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమేనని ఆరోపించారు. రాష్ట్రాన్ని సంపన్నం చేయడంకాదు… సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానమా అని నిలదీశారు. అనిల్ అంబానీ దివాళా తీసిన పారిశ్రామిక వేత్త అని చెప్పారు. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారని అన్నారు.ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే… మళ్లీ దోపిడీనే అని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.