అక్షర విజేత, కొమురవెల్లి: తోట బావి చిన్న పట్నం వద్ద గుంపులో స్పృహతప్పి పడిపోయిన వృద్దురాలను గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్నాయా ఏఆర్ కానిస్టేబుల్ మహేందర్, వెంటనే ఆమెను ఎత్తుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న మెడికల్ సిబ్బందిని పిలిపించి చికిత్స చేయించి స్పృహ వచ్చిన తర్వాత అక్కడ నుండి క్షేమంగా పంపించడం జరిగింది. చిన్న పట్నానికి వచ్చిన భక్తులు పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
2 Less than a minute