తెలంగాణ

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీని కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే

కోరుట్ల మార్చి 04 తెలంగాణ న్యూస్తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిణిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం కలిశారు. కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్ లోని బీఏస్సి ప్రభుత్వ బాలికల వ్యవసాయ కళాశాలను రాజేంద్రనగర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేయాలని కోరారు. ఇటీవల కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన విషయాన్ని సెక్రటరీకి తెలిపారు. విద్యార్థులకు ప్రయోగశాల (ల్యాబ్) ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థల పరిధిలో ఉన్న కోరుట్ల మహిళ బీఏస్సి వ్యవసాయ కళాశాల ఈ అనుబంధం ద్వారా విద్యార్థులకు మెరుగైన వనరులు, అధ్యాపకులు, పరిశోధన అవకాశాలకు అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఈ అనుబంధం ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. సరిపోని కళాశాల పాఠశాల భవన సదుపాయాలు, తీవ్రమైన మౌలిక సదుపాయాలు ఈ కళాశాల ఎదుర్కొంటుదని అన్నారు. బాలికల విద్యార్థులకు ముఖ్యంగా ప్రత్యేక మరుగుదొడ్లు, అదనపు గదుల వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవని, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. వ్యవసాయ విద్యకు శిక్షణ, ప్రయోగశాల అవసరం అయినప్పటికీ ఈ కళాశాలలో ప్రయోగశాల లేదని అత్యాధునిక పరికరాలతో ఆధునిక ప్రయోగశాల స్థాపనకు అవసరమైన నిధులను అందించాలని కోరారు.

Show More

Related Articles

Back to top button