భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై యాజమాన్యం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని,పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ. కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.బుధవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లో కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకపోవడం సరికాదని,తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను పెంచాలని, కనీస వేతనాల సలహా మండలి లో కూడా కనీస వేతనాలు జీవోలను రివైజ్ చేయాలని డిమాండ్ చేశారు.వేతనాల పెంపుదల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెరగక తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపదలకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎం చంద్రశేఖర్, సంజీవరావు,రమణ, అప్పారావు,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
0 Less than a minute