శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు.గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయించింది.ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా టీటీడీ నిర్వహించనుంది.ఈ మేరకు తొలిసారిగా వార్షిక విశేషపూజను వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ…
0 Less than a minute