యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి / 22/
యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజు ఉదయం ఆలయ ప్రధాన ద్వారం అనంతరం స్వామివారి పాదాల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శ్రవణా నక్షత్రం సందర్భంగా సుమారు 550 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాలను పటిస్తూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు , చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణల ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది కల్పించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనుచున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా మంచినీటి సదుపాయాలు మజ్జిగ వంటివి పంపిణీ చేశారు. ఎండల దృశ భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్నాకర్త మానేపల్లి రామారావు చెరవాణి ద్వారా తెలిపారు. భక్తుల దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.