తెలంగాణన్యూస్:

- అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుడిన శుభాంశు శుక్లా బృందం
- శుభాంశు ధైర్యం, అంకితభావం స్పూర్తిగా నిలుస్తుందన్న రేవంత్ రెడ్డి
- శుభాంశు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్ష
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగు పెట్టిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సాహసోపేతమైన, చారిత్రాత్మక యాక్సియం-4 మిషన్‌ను శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో వారికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
శుభాంశు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని, భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉంటారని ముఖ్యమంత్రి కొనియాడారు. పైలట్ శుభాంశు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని, దేశానికి మరింత సేవ చేయాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.