తెలంగాణ

శాసనమండలిలో ఖాళీ అవుతున్న రెండు యాదవ స్థానాలు యాదవులకే ఇవ్వాలి…

ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపీకృష్ణ యాదవ్ డిమాండ్....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న 5 స్థానాలలో రెండు స్థానాలు యనమల రామకృష్ణుడు,జంగా కృష్ణమూర్తి యాదవులు ప్రాతినిధ్యం వహిస్తున్నవని, ఆ స్థానాలు తిరిగి యాదవులకే కేటాయించాలని మంగళవారం ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అద్యక్షుడు చిరుమామిళ్ళ గోపీకృష్ణ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఒంగోలు లోని స్థానిక జేఏసీ కార్యాలయం లో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు ఎలాగో ఇవ్వడం లేదు, ఖాళీ అవుతున్న మా స్థానాలనే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న, పార్టీ విజయానికి సహకరించిన టిడిపి యాదవ నేతలకు కేటాయించాలని తమ డిమాండ్ చేశారు,

Show More

Related Articles

Back to top button