హనుమకొండ జిల్లా ప్రతినిధి//తెలంగాణ న్యూస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ నెల 16 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టనున్నారు అని ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ వేలేరులోని కస్తూరి భాయి పాఠశాల కళాశాల వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల కు టీచర్ లకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే RTC యాజమాన్యంతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు అదేవిధంగా వేలేరు PHC సబ్ సెంటర్ గతంలో మంజూరు అయిన నిధులు విడుదల లేక పనులు ప్రారంభించడం జరగలేదని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి అని తెలిపారు, వేలేరు మండలంలోని గుండ్లసాగర్ గ్రామం నుండి వెంకటాద్రి పేట వెళ్లే మార్గంలో నేరెళ్ళ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన 3 నెలల్లోనే పూర్తిగా దెబ్బతిని కూలి పోవడం జరిగింది రాకపోకలకు,రైతులకు, ఇబ్బంది కలుగుతున్నదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు అని ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేయడం జరిగింది అని సద్దాం హుస్సేన్ తెలిపారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పనులు మొదలు పెడుతానని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు నియోజక వర్గ నాయకులు మండల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.