వృద్ధుడి ప్రాణం తీసిన చుట్టా.
.
తెలంగాణన్యూస్,ఖమ్మం:
మంచానికి తాగిన చుట్టా అంటుకుని వృద్ధుడు సజీవ దహనం అయిన ఘటన నేలకొండపల్లి మండలంలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం
ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని (డోలు)వెంకులు (79) మంచంలో పడుకొని చుట్టా తాగుతున్న క్రమంలో దురదృష్టవశాతు నవారా మంచానికి నిప్పు అంటుకుని రగులుకుంది.అదే సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో మంచంలో పడుకుని ఉన్న వెంకులు సజీవ దహనం అయ్యాడు.ఘటన స్థలానికి చేరుకున్న నేలకొండపల్లి ఎస్సై సంతోష్ దర్యాప్తు చేపట్టారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.