ఇల్లంతకుంట /తెలంగాణ న్యూస్రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జీపురం గ్రామంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో లబ్ధిదారులకు సంబంధించిన రెండు లక్షల అరవైఆరు వేల ఐదు వందలు (266,500/-)రూపాయలు గల సిఏం సహయ నిధి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్ల కోమటి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం రోజున లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సిఎం నిధి పేదలకు ఓక వరం అని అన్నారు.తదనంతరం లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల బాల్ రెడ్డి, బొల్లారం పరుశరాములు, బొజ్జ శ్రీనివాస్ మందాటి బాల్ రెడ్డి, సుధాగోని బాలయ్య, బొల్లారం నాగరాజు, సోమిరెడ్డి అనిల్,మాందాటి వెంకట్ రెడ్డి, వెలిశాల, శ్రీనివాస్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..
…
1 Less than a minute