అనంతజనశక్తి న్యూస్”AP&TGఆధార్ తరహాలో ప్రతి రైతుకు 14 సంఖ్యలతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నమోదైన వారికే కేంద్ర ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. త్వరలో రైతు సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై మండల వ్యవసాయాధికారులకు గతేడాది డిసెంబరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీఏఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారికిచ్చిన పోర్టల్ లో రైతు వివరాలు నమోదు చేసి విశిష్ట సంఖ్య కేటాయిస్తారు. ఈ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.▪️ముందుగా పీఎం కిసాన్ లబ్దిదారులకు కేటాయిస్తారు. తరువాత మిగిలిన అన్నదాతలు, కౌలు రైతులు, రైతు కూలీలకు జారీ చేయనున్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో వీఏఏలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన లాగిన్ ఇచ్చారు. అందులో నమోదు చేసిన వివరాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తారు.▪️ఆర్థిక సేవలు పొందే అవకాశం రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో అనుసంధానం చేస్తారు. కౌలు రైతులు, భూమి లేని కూలీలకు ఆధార్ సంఖ్య ఆధారంగా నమోదు చేస్తారు. విశిష్ట సంఖ్యను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింక్ తో కూడిన ఆర్థిక సేవలు పొందే అవకాశం ఉంది. దీనిసాయంతో దేశంలో ఎక్కడ నుంచైనా అన్నదాతల రుణ అర్హత, బకాయిలు, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు
23 1 minute read