- *రేపాకుల వెంకన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం*
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు.
- రేపాకుల లేని లోటు తీర్చలేనిది ÷ సిపిఎం పాలెం కార్యదర్శి బండి రమేష్
సిపిఎం పార్టీ ఆశయాల కోసం చివరిదాకా పనిచేసిన వ్యక్తి రేపాకుల వెంకన్న÷ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్
సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రేపాకుల వెంకన్న స్తూపం ఆవిష్కరణ,సంస్మరణ సభలో వక్తల పిలుపు…
తెలంగాణన్యూస్,ఖమ్మం
:
రేపాకుల వెంకన్న ఆశయా సాధన కోసం అందరం కృషి చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామపంచాయతీ శివారు పాపాయిగూడెంలో రేపాకుల వెంకన్న సంస్మరణ సభ సందర్భంగా వెంకన్న స్థూపాన్ని ఆవిష్కరించారు.ఈ స్తూప ఆవిష్కరణ అలాగే సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ రేపకుల వెంకన్న తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసారని కేవలం 52 సంవత్సరాల వయసులో చనిపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు.ప్రజల సమస్యల కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వస్తున్నా వెంకన్న ఆక్సిడెంట్ ద్వారా చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. వెంకన్న లాంటి ఉత్తమ కమ్యూనిస్టులు కోల్పోవడం బాధాకరమని ఆయన ఆశయాల కోసం అందరం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ రేపకుల వెంకన్న లేని లోటు తీర్చడం సాధ్యం కాదని, అలాంటి మంచి కార్యకర్తలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అన్నారు. ఇక్కడ లేకపోవడం పాపాయిగూడెం గ్రామానికి మండల పార్టీకి కూడా నష్టమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల ఇన్చార్జి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ రేపాకుల వెంకన్న సున్నితమైన మనస్సు కలిగిన వాడని, మంచి స్నేహశీలని,కుటుంబాన్ని, సంఘాన్ని సమానంగా ప్రేమించిన వ్యక్తిని ఆయన అన్నారు. వెంకన్న ధన్యజీవిని అని సందర్భంగా కొనియాడారు.
ఈ సంస్మరణ సభకు మండల కార్యదర్శి కొమ్ము శీను అధ్యక్షత వహించగా ముందు స్థూపాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు శివలింగం, సిపిఎం నాయకులు అంగిరేకుల నరసయ్య, కొలిచలం స్వామి, శాఖ కార్యదర్శి జాల ఉమేష్ బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సిపిఎం నాయకులు దాసరి మహేందర్, బింగి రమేష్, వేగినాటి మంగతాయారు,కొత్తపల్లి వెంకన్న, పద్మనాభల సుధాకర్ సొసైటీ డైరెక్టర్ చల్ల వెంకటేశ్వర్లు రామనబోయిన రవి దొండేటి నిర్మల్రావు పిట్టల పాపారావు పప్పుల ప్రసాద్ వశపొంగు వీరన్న పురావుల విజయపాల్ రెడ్డి పుసులూరి వీరభద్రం దాసరి మహేందర్ కోడి లింగయ్య దొడ్డ లింగస్వామి సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి చాలా ఉమేష్ మాజీ కార్యదర్శి సొంటి వెంకటేశ్వర్లు రేపాకుల భద్రయ్య రేపాకుల రాధాకృష్ణ బొడ్డు లక్ష్మీనారాయణ పీడియాల రామారావు గుంటి వెంకన్న గుంటి ఉపేందర్ గుంటి వీరన్న ఉప్పల గోపాలకృష్ణ జాలకన్నయ్య షేక్ షరీఫ్ జాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు కొమ్ము రమేష్ ఆలపించిన గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.